Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి : యెండల లక్ష్మీనారాయణ

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ‘హర్​ గర్​ తిరంగా’లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Har Ghar Tiranga | ప్రధాని మోదీ (PM Modi) ఇచ్చిన పిలుపు మేరకు ‘హర్​ గర్​ తిరంగా’లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు.

Har Ghar Tiranga | దేశభక్తి చాటుకోవాలి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జెండా ఎగురవేసిన అనంతరం యెండల మాట్లాడారు. భారతీయులలో దేశభక్తిని, ఐక్యత శక్తిని పెంపొందించడం కోసం దేశ ప్రధాని మోదీ హర్​ గర్​ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశ విద్రోహశక్తులకు దేశభక్తితోనే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి..: Young India School | యంగ్ ఇండియా స్కూల్ కలేనా!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *