Meloni Modi | ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని రికార్డు.. మోదీ అభినందనలు

ఇటలీ యుద్ధానంతర రాజకీయ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం వరుసగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నేతగా జార్జియా మెలోని అరుదైన రికార్డు సృష్టించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Meloni Modi | ఇటలీ యుద్ధానంతర రాజకీయ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం వరుసగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నేతగా జార్జియా మెలోని అరుదైన రికార్డు సృష్టించారు. ఈ చారిత్రక ఘనత సాధించిన ఆమెకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Meloni Modi | ప్రజల నమ్మకం..

మెలోని సాధించిన రికార్డు ఇటలీ ప్రజల విశ్వాసానికి, ఆమె సమర్థ నాయకత్వానికి నిదర్శనమని ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత్-ఇటలీ మధ్య ఉన్న ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్’ (ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం) బలోపేతం కావడంలో మెలోని స్నేహం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల కోసం ఒక సంపన్నమైన భవిష్యత్తును నిర్మించే దిశగా ఆమెతో కలిసి సన్నిహితంగా పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆమె భవిష్యత్తు విజయాలకు మోడీ అభినందనలు తెలిపారు.

Meloni Modi | భారత్-ఇటలీ బంధం..

ప్రధాని మోడీ శుభాకాంక్షలపై ఎక్స్ వేదికగా జార్జియా మెలోని స్పందించారు. “ప్రియమైన నరేంద్ర మోదీ.. మీ శుభాకాంక్షలకు, మీ ప్రత్యేక స్నేహానికి ధన్యవాదాలు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం భారత్, ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ఇటీవల ఇరు దేశాల మధ్య ప్రారంభించిన స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ బంధం ప్రాధాన్యతను చాటుతోందని మెలోని గుర్తుచేశారు. రెండు దేశాల వద్ద ఉన్న నైపుణ్యాలను ఒకచోట చేర్చి, భవిష్యత్తులో కొత్త అవకాశాలను సృష్టించేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Revanth Government Failure | హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *