అక్షరటుడే, వెబ్డెస్క్ : Inter Education | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరు కూడా ఇంటర్ తీసేయాలని అనరన్నారు.
రాష్ట్రంలో ఇంటర్ విద్యను తీసేసి, సీబీఎస్ఈ తరహాలో 10+2 విధానం అమలు చేస్తామని గతంలో పలుమార్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కవిత మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియేట్ విద్య ఎంతో మెరుగ్గా ఉందన్నారు. దాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఇంటర్ విద్యను తీసేస్తామని అనడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Inter Education | సీఎం పోకడలను వ్యతిరేకించాలి
అప్పుడప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే భయమవుతుందని కవిత సెటైర్లు వేశారు. వైట్ కాలర్ జాబ్స్ వదిలేసి…బ్లూ కాలర్ జాబ్స్ వెతుక్కోవాలని ఆయన అంటున్నారన్నారు. విదేశాల్లో బ్లూ కాలర్ జాబ్ లు అంటే లేబర్ ఉద్యోగాలు వెతుక్కోవాలని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఉద్యోగాలు కల్పించే వ్యాపారవేత్తలను తయారు చేయాలే గానీ ఉద్యోగాల కోసం వెతుక్కునే వాళ్లను కాదన్నారు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న పోకడను వ్యతిరేకించాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ కూడా సిగ్గుపడుతారని ఎద్దేవా చేశారు. ఆయన ఒక మీటింగ్ లో ఇంటర్మీడియేట్ ప్రవేశాలు ఈ ఏడాది నుంచి తీసుకోమని అంటాడని, రెండు రోజుల్లో ఇంటర్ అడ్మిషన్లు అంటూ బోర్డు ప్రకటనలు చేస్తుందన్నారు.
Inter Education | మేధావులతో చర్చించాలి
ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు మేధావులు, సబ్జెక్ట్ నిపుణులతో చర్చించాలని కవిత సూచించారు. లేదంటే ఆ నిర్ణయాలు ఇలాగే బెడిసి కొడుతాయని పేర్కొన్నారు. ఇంటర్ విద్యను తీసేస్తే ఆడపిల్లలు చదువుకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యను తీసేయం అని అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ కూడా సిగ్గుపడుతాడు. ఓవైపు ఇంటర్మీడియేట్ ప్రవేశాలు ఈ ఏడాది నుంచి తీసుకోమని అంటాడు… రెండు రోజుల్లో ఇంటర్ అడ్మిషన్లు అంటూ ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటనలు చేస్తుంది. ముఖ్యమంత్రి చెప్పే మాటలకు ప్రభుత్వ శాఖలు చేసే ప్రకటనలకు పొంతన… pic.twitter.com/J5Njhs3qom
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 4, 2026
దీనిని కూడా చదవండి : BRS Protest | అమలు చేయని కాంగ్రెస్ హామీలకు నిరసనగా బీఆర్ఎస్ వంటావార్పు..