అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: BRS Protest | అమలు చేయని కాంగ్రెస్ హామీలకు నిరసనగా బీఆర్ఎస్ వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని (Nizamabad) ధర్నాచౌక్‌లో నగర బీఆర్ఎస్ (BRS Nizamabad) పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన చేపట్టారు.
BRS Protest | మాజీ ఎమ్మెల్యే బిగాల ఆధ్వర్యంలో..
వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ సమర భేరి మోగించిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్‌కు ప్రత్యామ్నాయంగా హామీలు, కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు స్కూటీలు వంటి అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, సత్య ప్రకాష్, గాండ్ల లింగం, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, ప్యాట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మైక్రోసాఫ్ట్ జాబ్ వదిలేసి భారత్‌కు… ఓ యువకుడి భావోద్వేగ పోస్ట్