Konda Surekha Dismissal | ఆ కారణం వల్లే కొండా సురేఖ బర్త్‌రఫ్: టీపీసీసీ చీఫ్

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ బర్త్‌రఫ్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Konda Surekha Dismissal | తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ బర్త్‌రఫ్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  ( Mahesh Kumar Goud )స్పందించారు. మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించడం బాధాకరమే అయినప్పటికీ, పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే హైకమాండ్ నుంచి కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. నాయకులు తమ అభిప్రాయాలను, సమస్యలను చెప్పుకోవడానికి పార్టీలో అంతర్గతంగా ఎన్నో వేదికలు ఉన్నాయని, వాటిని పక్కన పెట్టి బహిరంగంగా మీడియాతో మాట్లాడటం క్షమించరాని తప్పిదమని ఆయన పేర్కొన్నారు.

Konda Surekha Dismissal | ఖండించకపోవడమే కారణం..

కొండా సురేఖ కుమార్తె చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఆమె కనీసం ఖండించకపోవడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత సీరియస్‌గా పరిగణించిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ నియమాలను లెక్కచేయని వైఖరి కారణంగానే అధిష్టానం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం, లేదా ఒత్తిడి తెచ్చేందుకు ఎవరినీ బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.

Konda Surekha Dismissal | పార్టీలోనే కొనసాగాలని..

మంత్రి పదవి నుంచి తొలగించినప్పటికీ, కొండా సురేఖ పార్టీలోనే కొనసాగాలని తామంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీలో విధేయత, క్రమశిక్షణను కాపాడేందుకే అధిష్టానం ఈ కఠిన వైఖరి అవలంబించిందని, పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా హైకమాండ్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ తన తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి:  Gutpa Alisagar Irrigation Water | ఫలించిన సుదర్శన్​ రెడ్డి, భూపతిరెడ్డి కృషి.. ఖరీఫ్​కు నీటివిడుదల

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *