అక్షరటుడే వెబ్‌డెస్క్: YouTube View Count | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన వ్యూ కౌంట్ విధానంలో కీలక మార్పులను తీసుకువచ్చింది. ఆగస్టు 24 నుంచి ప్లాట్‌ఫామ్‌లోని అన్ని రకాల వీడియోలకు ప్లేబ్యాక్ ప్రారంభమైన మరుక్షణమే దానిని ఒక వ్యూగా పరిగణించనున్నట్లు టీమ్ యూట్యూబ్ స్పష్టం చేసింది.
YouTube View Count | ప్రత్యేక ఆప్షన్..
ఇప్పటివరకు సాధారణ లాంగ్-ఫార్మాట్ వీడియోలను కనీసం 30 సెకన్లు చూస్తేనే వ్యూగా లెక్కించేవారు. కానీ ఆగస్టు 24 నుంచి వీడియో ప్లే అవ్వడం లేదా లైవ్ స్ట్రీమ్‌లోకి వీక్షకుడు అడుగుపెట్టిన తక్షణమే పబ్లిక్ వ్యూ కౌంటర్ పెరుగుతుంది. ఈ నూతన నిబంధన యూట్యూబ్ షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్ లాంగ్-ఫార్మాట్ వీడియోలు అన్నింటికీ వర్తించనుంది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తరహాలోనే ఇకపై యూట్యూబ్‌లోనూ వ్యూస్ నమోదు కానున్నాయి. పాత పద్ధతి ప్రకారం వీడియోను నిజంగా ఎంతసేపు చూశారో తెలుసుకోవడానికి యూట్యూబ్ అనలిటిక్స్‌లో ‘ఎంగేజ్డ్ వ్యూస్’ అనే ప్రత్యేక ఆప్షన్‌ను అందుబాటులో ఉంచారు.
YouTube View Count | యూజర్లపై ప్రభావం..
పబ్లిక్ వ్యూ కౌంటర్‌లో వీడియో ప్లే అయిన ప్రతిసారీ వ్యూ నమోదు కావడం వల్ల వీడియోల వ్యూస్ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తుంది. అయితే, బయటకు కనిపించే వ్యూస్ సంఖ్య మారినప్పటికీ, క్రియేటర్ల రెవెన్యూ, యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) అర్హతల్లో ఎలాంటి మార్పు ఉండదని టీమ్ యూట్యూబ్ స్పష్టం చేసింది. వీక్షకుల వాచ్ టైమ్, ఎంగేజ్‌మెంట్ ఆధారంగానే పాత పద్ధతిలోనే ఆదాయాన్ని లెక్కించనున్నారు.
🚨 YouTube వ్యూ కౌంటింగ్‌లో కీలక మార్పు!
ఆగస్టు 24 నుంచి వీడియో ప్లే అవ్వడం ప్రారంభమైన వెంటనే ఒక వ్యూగా కౌంట్ చేయనుంది.
వీడియోను ఎంతసేపు చూశారనే దానితో సంబంధం లేకుండా వ్యూ నమోదు కానుంది. రీవాచ్ చేసినా వ్యూగా లెక్కించనుంది.
అయితే మానిటైజేషన్‌పై ఈ మార్పు ప్రభావం ఉండదు.…
— greatandhra (@greatandhranews) August 18, 2026
ఇది కూడా చదవండి: Bajireddy Govardhan | సీఎం రేవంత్ రెడ్డిని పడగొట్టేది ఎమ్మెల్యేలే : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్