Bajaj Electronics Festive Offer | ఎలక్ట్రానిక్స్ మార్ట్ అదిరిపోయే పండుగ ఆఫర్

భారతదేశంలో పండుగ సీజన్ అంటేనే షాపింగ్ సందడి మామూలుగా ఉండదు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bajaj Electronics Festive Offer | భారతదేశంలో పండుగ సీజన్ అంటేనే షాపింగ్ సందడి మామూలుగా ఉండదు. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ ‘ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్’ (EMIL) సరికొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అక్టోబర్ 11, 2026 నుంచి తమ బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ మార్ట్ స్టోర్లలో ‘భారతదేశపు అతిపెద్ద పండుగ ఆఫర్’ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

Bajaj Electronics Festive Offer | రూ. 1 కోటి నగదు, 20 కార్లు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  (  Telangana ) వ్యాప్తంగా ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో షాపింగ్ చేసే కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా ఏకంగా రూ. 1 కోటి నగదు , 20 మారుతి సుజుకి ఆల్టో కె10 (Alto K10) కార్లను గెలుచుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. అలాగే ఢిల్లీ ఎన్‌‌సీఆర్ ప్రాంతంలోని ఎలక్ట్రానిక్స్ మార్ట్ స్టోర్లలో కొనుగోలు చేసే వారికి రూ. 50 లక్షల వరకు నగదు బహుమతి గెలుచుకునే ఛాన్స్ ఉంది.

Bajaj Electronics Festive Offer | ప్రత్యేక డిస్కౌంట్లు..

పండుగ సమయంలో తమ గృహోపకరణాలు, వ్యక్తిగత గాడ్జెట్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ టైమ్. కస్టమర్లు ప్రముఖ బ్రాండ్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ల్యాప్‌టాప్‌లు, కిచెన్ అప్లయెన్సెస్ వంటి ఎన్నో వస్తువులను ఆకర్షణీయమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు.

Bajaj Electronics Festive Offer | నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలు..

కేవలం బహుమతులే కాకుండా, కస్టమర్ల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కంపెనీ ప్రత్యేక పండుగ ధరలతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు , నో-కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చింది.

Bajaj Electronics Festive Offer | అందుబాటులో ..

ప్రస్తుతం ఈఎంఐఎల్ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ‘బజాజ్ ఎలక్ట్రానిక్స్’ పేరుతో 160కి పైగా స్టోర్లను, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ‘ఎలక్ట్రానిక్స్ మార్ట్’ పేరిట 30కి పైగా స్టోర్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ ఆఫర్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ కోరుతోంది.

ఇది కూడా చదవండి:  Wife Suicide Case | భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *