Tecno POP X | ఐఫోన్ లుక్‌తో.. బడ్జెట్ ఫోన్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tecno POP X | చైనాకు చెందిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ (Smartphone)ల తయారీ సంస్థ టెక్నో మరో 5జీ స్మార్ట్ ఫోన్ ను తీసుకువచ్చింది. టెక్నో పీవోపీ ఎక్స్ 5జీ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్.. ఐఫోన్ 17 ఎయిర్ డిజైన్ లా ఉంటుంది. బడ్జెట్ ధరలో దీనిని తీసుకువచ్చారు. ఇది అమెజాన్ (Amazon)తో పాటు టెక్నో వెబ్ సైట్ లో ఈనెల 24 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసేద్దామా..

Tecno POP X | డిస్‌ప్లే :

6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 720 1576 పిక్సల్స్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సర్టిఫికెట్ కలిగి ఉంది.

Tecno POP X | సాఫ్ట్‌వేర్ :

మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హెచఐవోఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

కెమెరా సెటప్ : వెనకవైపు 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ సామర్థ్యం : 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్ : మిడ్ నైట్ బ్లూ, రిప్పిల్ గ్రీన్ కలర్స్‌లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999.

కార్డ్ ఆఫర్ : అమెజాన్‌పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: Venue Night Edition | కొత్త ఫీచర్లు, స్టైలిష్ లుక్‌తో.. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ లాంచ్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *