Venue Night Edition | కొత్త ఫీచర్లు, స్టైలిష్ లుక్‌తో.. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ లాంచ్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Venue Night Edition | హ్యుందాయ్ (Hyundai) మరో మోడల్‌ను వెన్యూ నైట్ ఎడిషన్ పేరుతో లాంచ్ చేసింది. కొత్త ఫీచర్లు, ఆకట్టుకునే స్టైల్‌తో ఈ ప్రత్యేక ఎడిషన్ ను తీసుకువచ్చారు. దీని ప్రారంభ ధర(ఎక్స్ షోరూమ్) సుమారు రూ. 9.70 లక్షలు. సాధారణ వెన్యూ మోడల్ (Venue Model)తో పోలిస్తే.. నైట్ ఎడిషన్ మరింత స్పోర్టీగా, స్టైలిష్ గా కనిపిస్తుంది. హేజల్ బ్లూ మ్యాట్, మిస్టిక్ సఫైర్ మ్యాట్ లాంటి కొత్త కలర్స్ ఈ ఎడిషన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని ప్రత్యేకతలు తెలుసుకుందామా..

Venue Night Edition | క్రేజీ డిజైన్..

కారును నలుపు రంగు థీమ్‌తో డిజైన్ చేశారు. ముందు గ్రిల్, స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రైల్స్, సైడ్ మిర్రర్లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా నలుపు రంగులో ఉన్నాయి. మ్యాట్ బ్లాక్ ఫినిష్ లో హ్యుందాయ్ లోగో ఉండగా.. బ్రేక్ కాలిపర్లు ఎరుపు రంగు లో ఉన్నాయి. ‘నైట’ అనే ప్రత్యేక బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఇవి కారుకు మరింత ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తున్నాయి.

Venue Night Edition | ఇంటీరియర్..

కారు లోపలి భాగంలో కొన్ని మార్పులు చేశారు. కాగా ఇంటీరియర్ కూడా నలుపు రంగులోనే ఉంది. ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా సాధారణ వెన్యూ మాదిరిగానే ఉన్నాయి. సీట్ల డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉండేలా కొత్త అప్‌హోల్స్టరీను ఉపయోగించారు. కారు లోపల ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది.

ఫీచర్లు : ఇందులో డ్రైవింగ్, ఎమర్జెన్సీ, ఈవెంట్, వెకేషన్, ఆన్ డిమాండ్, ఫొటో క్యాప్చర్ వంటి బహుళ రికార్డింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది డ్రైవింగ్ సమయంలో వీడియో రికార్డ్ చేయడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉపయోగపడుతుంది. అవసరమైతే వీడియోలను వెంటనే రికార్డ్ చేసి సేవ్ చేసుకునే విధంగా ఇందులో పలు పలు మోడ్ లు ఉన్నాయి. భద్రత పరంగా ఇది ఉపయోగపడుతుంది.

ఇంజిన్ ఎంపికలు : పాత వెర్షన్‌లోని ఇంజన్‌లతోనే నైట్ ఎడిషన్ అందుబాటులో ఉంది. 1.2 లీటర్ పెట్రోల్, డీసీటీతో జత చేసిన 1.0 లీటర్ టర్బో పెట్రోల్, మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మరింత ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి..: April 23 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభంకానున్న దేశీయ మార్కెట్లు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *