2026 ‘టీమ్ ఇండియా’ భాగస్వామిగా ఐఓఏతో యస్ బ్యాంక్ భాగస్వామ్యం!

Shivam nagarani

ముంబై: భారతదేశపు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన యస్ బ్యాంక్, 2026లో జరగనున్న నాలుగు ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనే ‘టీమ్ ఇండియా’కు అధికారిక రీటెయిల్ బ్యాంకింగ్ భాగస్వామిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)కి తమ మద్దతును ప్రకటించింది. పారిస్ 2024 ఒలింపిక్స్ సందర్భంగా టీమ్ ఇండియాకు అధికారిక బ్యాంకింగ్ భాగస్వామిగా విజయవంతమైన పాత్ర పోషించిన యస్ బ్యాంక్, ఈ చరిత్రాత్మక భాగస్వామ్యం ద్వారా దేశంలో క్రీడల అభివృద్ధికి , యువ క్రీడాకారుల భవిష్యత్తుకు తోడ్పడాలనే తమ దీర్ఘకాలిక నిబద్ధతను పునరుద్ఘాటించింది.

2026లో జరిగే నాలుగు ప్రధాన అంతర్జాతీయ పోటీలైన కామన్వెల్త్ గేమ్స్ 2026 (గ్లాస్గో, స్కాట్లాండ్), ఆసియన్ గేమ్స్ 2026 (ఐచి-నాగోయా, జపాన్), యూత్ ఒలింపిక్ గేమ్స్ 2026 (డకార్, సెనెగల్) , ఆసియన్ ఇండోర్ & మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2026 (రియాద్, సౌదీ అరేబియా) లలోని 100కి పైగా క్రీడాంశాలలో భారతీయ అథ్లెట్లకు బ్యాంక్ మద్దతుగా నిలుస్తుంది. ఐచి-నాగోయాలో జరిగే ఆసియా క్రీడలకు ముందు భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేసేందుకు కూడా ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది.

యస్ బ్యాంక్ ఎండీ & సీఈఓ శ్రీ వినయ్ ఎమ్. టోన్సే మాట్లాడుతూ..
“2026లో జరగబోయే నాలుగు ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలలో టీమ్ ఇండియాకు మద్దతుగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో జట్టు కట్టడం మాకు ఎంతో గర్వకారణం. దేశాన్ని ఉత్తేజపరచడానికి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, గ్రామీణ స్థాయిలో ప్రతిభను వెలికితీసేందుకు , క్రమశిక్షణ, కృషి, సమిష్టి కృషితో క్రీడాకారుల క్యారెక్టర్‌ను మలచడానికి క్రీడలకు అపారమైన శక్తి ఉంది. కోట్లాదిమంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను మోస్తూ టీమ్ ఇండియా ప్రపంచ వేదికపై పోటీపడుతున్న వేళ, మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేస్తున్న మన అథ్లెట్ల పక్కన నిలబడటం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాము” అని పేర్కొన్నారు.

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Dr. పి.టి. ఉష మాట్లాడుతూ..
“ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క దీర్ఘకాలిక భాగస్వామిగా యస్ బ్యాంక్‌ను స్వాగతించడం , దేశంలో క్రీడల అభివృద్ధికి వారి నిరంతర మద్దతు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. 2026లో జరిగే నాలుగు ప్రధాన క్రీడా పోటీలలో టీమ్ ఇండియాకు యస్ బ్యాంక్ ‘రీటెయిల్ బ్యాంకింగ్ భాగస్వామి’గా వ్యవహరిస్తుంది. పారిస్ 2024 ఒలింపిక్స్ భాగస్వామ్య స్ఫూర్తితో, ఈ ఒప్పందం ద్వారా క్రీడా రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేమంతా కలిసి మన అథ్లెట్ల విజయాలను వేడుక చేసుకుంటూ, కోట్లాది మంది భారతీయులలో స్పూర్తి నింపుతూ , ‘వికసిత భారత్’ జాతీయ లక్ష్యానికి అనుగుణంగా క్రీడలను అభివృద్ధికి ప్రధాన మూలస్తంభంగా మారుస్తాము” అని తెలిపారు.

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *