Lava Bold N4 Lite | రూ. 8 వేలకే స్మార్ట్ ఫోన్.. సెప్టెంబర్ 3 నుంచి సేల్ ప్రారంభం

లావా కంపెనీ సామాన్యులకోసం మరో స్మార్ట్ ఫోన్ మోడల్‌ను తీసుకువచ్చింది. దీని ధర రూ. 8 వేలు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lava Bold N4 Lite | దేశీయ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ అయిన లావా.. సామాన్యుల బడ్జెట్‌లో మరో మోడల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా బోల్డ్ ఎన్ 4 లైట్ పేరుతో భారత మార్కెట్‌లో విడుదలయ్యింది.

తక్కువ ధరలో మంచి ఫీచర్లతో దీనిని తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు ఏదైనా సమస్య తలెత్తితే ఇంటి వద్దే సర్వీస్ చేయించుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్ సేల్ వచ్చేనెల 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలనుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ (Amazon)తో పాటు లావా ఇండియా అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనుంది. లావా బోల్డ్ ఎన్ 4 లైట్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.56 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 540 1210 పిక్సల్స్ రిజల్యూషన్, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.
ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.

సాఫ్ట్ వేర్ : యూనిసాక్ ఎస్సీ 9863ఏ చిప్ సెట్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది.

Lava Bold N4 Lite | కెమెరా సెటప్..

వెనకవైపు 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ఏఐ కెమెరా సెట్ అప్ ఉంది.
ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ : 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్.. 10డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Lava Bold N4 Lite | సింగిల్ వేరియంట్..

ఈ ఫోన్ ఘోస్ట్ సిల్వర్, ఎంపైర్ గోల్డ్ కలర్స్‌లో సింగిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,099.

కార్డ్ ఆఫర్ : అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: Aug 29 Gold Prices | బంగారం ధరల భగభగ.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ఎంతంటే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *