Nepal Floods | వారికి అండగా నిలవాలి.. ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఖర్గే లేఖ

నేపాల్‌లో సంభవించిన విలయతాండవంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nepal Floods | నేపాల్‌లో సంభవించిన విలయతాండవంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితులపై సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన అధికారికంగా లేఖ రాశారు.

Nepal Floods | భారీ ప్రాణ, ఆస్తి నష్టం..

నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా గల్లంతయ్యారని ఖర్గే తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రజలు సరైన ఆహారం, మందులు, నివాసం, ఇతర అత్యవసర వసతులు లేక అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు.

Nepal Floods | కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి..

భారత ప్రభుత్వం వెంటనే నేపాల్‌తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలి. బాధితులకు అవసరమైన ఆహారం, వైద్య సదుపాయాలు, నివాస ఏర్పాట్లు తక్షణమే అందేలా చూడాలి. నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులను గుర్తించి, వారిని సురక్షితంగా దేశానికి రప్పించేందుకు ప్రత్యేక రెస్క్యూ చర్యలు ముమ్మరం చేయాలి. ఈ క్లిష్ట సమయంలో మానవతా దృక్పథంతో నేపాల్‌కు అన్ని విధాలా అండగా నిలవాలని ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇది కూడా చదవండి: Lava Bold N4 Lite | రూ. 8 వేలకే స్మార్ట్ ఫోన్.. సెప్టెంబర్ 3 నుంచి సేల్ ప్రారంభం 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *