అంతర్జాతీయంUK Investor Visa | కుబేరులకు బ్రిటన్ షాక్.. రూ.53 కోట్లు ఉంటేనే ఆ స్పెషల్...

UK Investor Visa | కుబేరులకు బ్రిటన్ షాక్.. రూ.53 కోట్లు ఉంటేనే ఆ స్పెషల్ వీసా

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరులను ఆకర్షించేందుకు బ్రిటన్ (UK) ప్రభుత్వం ఒక సరికొత్త వీసా విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.

అక్షరటుడే వెబ్‌డెస్క్:UK Investor Visa | ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరులను ఆకర్షించేందుకు బ్రిటన్ (UK) ప్రభుత్వం ఒక సరికొత్త వీసా విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం.. సంపన్న విదేశీ పౌరుల కోసం “ఇన్విటేషన్ ఓన్లీ” (ఆహ్వానం ద్వారా మాత్రమే) అనే ప్రత్యేక పెట్టుబడిదారుల వీసాను ప్రారంభించడానికి యూకే కసరత్తు చేస్తోంది.

UK Investor Visa|రూ.50 కోట్లకు పైగా ఇన్వెస్ట్..

ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదా (Residency Status) పొందాలనుకునే విదేశీ సంపన్నులు ఆ దేశంలో కనీసం 5 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 53 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ పెట్టుబడులను ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. బ్రిటన్ ప్రభుత్వం ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించిన ఫీల్డ్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిటిష్ వ్యాపారాలు, స్టార్టప్‌లు, పారిశ్రామిక రంగాలలో ఈ నిధులను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ రంగాలలో పెట్టుబడులు పెట్టే ధనవంతులకు మాత్రమే ఈ వీసా పొందేందుకు మొదటి ప్రాధాన్యత లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Bandi Sanjay Comments|నేను ఎలాంటివాడినో నా పార్టీ కార్యకర్తలకు తెలుసు:బండి సంజయ్

 

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...

Deloitte Visakhapatnam | విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. డెలాయిట్ ఎంట్రీకి సన్నాహాలు.. ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న సాగర నగరం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deloitte Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విశాఖపట్నం...

Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు...