RTC Digital Services | ఆర్టీసీ టికెట్​​ బుకింగ్​ కౌంటర్లలో డిజిటల్​ సేవలు ప్రారంభం..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: RTC Digital Services | ​ఆర్టీసీ (TGSRTC) నిజామాబాద్​ రీజియన్ (RTC Nizamabad Region) ​పరిధిలోని బస్టాండ్లలో టికెట్​​ బుకింగ్​ కౌంటర్ల వద్ద ఆన్​లైన్​ పేమెంట్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఆర్​ఎం జ్యోత్స్న తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

RTC Digital Services | చిల్లర సమస్య తగ్గించేందుకే..

రీజియన్​లోని అన్ని డిపోల్లో డిజిటల్​ పేమెంట్​ సౌకర్యం (TSRTC Online Payment) కల్పించినట్లు ఆర్​ఎం తెలిపారు. దీంతో కౌంటర్ల వద్ద చిల్లర నగదు సమస్య తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. టికెట్​ బుకింగ్​తో పాటు బస్​పాస్​ సేవలకు కూడా ఆన్​లైన్​లోనే పేమెంట్​ చేసే అవకాశం కల్పించామన్నారు. నగదు చెల్లింపులతో పాటు గూగుల్ పే (Google pay), ఫోన్​పే, పేటీఎం వంటి యూపీఐ యాప్​ల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా టికెట్లు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Parle Industries | మెలోనికి ‘మెలోడీ’ ఇచ్చిన మోదీ.. పార్లే అనుకుని.. పార్లేను కొన్న ఇన్వెస్టర్లు!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *