బిజినెస్​Parle Industries | మెలోనికి ‘మెలోడీ’ ఇచ్చిన మోదీ.. పార్లే అనుకుని.. పార్లే ఇండస్ట్రీస్ షేర్లను...

Parle Industries | మెలోనికి ‘మెలోడీ’ ఇచ్చిన మోదీ.. పార్లే అనుకుని.. పార్లే ఇండస్ట్రీస్ షేర్లను కొన్న ఇన్వెస్టర్లు!

ఇటాలియన్ ప్రధాని మెలోనికి మన ప్రధాని మోదీ పార్లే ప్రొడక్ట్స్‌కు చెందిన మెలోడీ టాఫీలను బహుమతిగా ఇచ్చారు. అయితే స్టాక్​ మార్కెట్​ ఇన్వెస్టర్లు పార్లే ప్రొడక్ట్స్ అనుకుని పార్లే ఇండస్ట్రీస్ షేర్లను ఎగబడి కొన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Parle Industries | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఐదు దేశాల పర్యటనలో భాగంగా మంగళవారం ఇటలీ వెళ్లారు. రోమ్ లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన పార్లే ప్రొడక్ట్స్ కంపెనీకి చెందిన మెలోడీ టాఫీలను బహుమతిగా ఇచ్చారు. ఈ రోజు ఉదయం ఇటలీ ప్రధానమంత్రి మెలోని ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రధాని మోదీ తనకు ఒక మెలోడీ టాఫీల ప్యాక్‌ను బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు.

Parle Industries | సంబంధం లేకున్నా..

ఇటలీ ప్రధాని మెలోనీ చేసిన సోషల్ మీడియా (Social Media) పోస్ట్ వైరల్ గా మారింది. మెలోడీ టాఫీ పార్లే ప్రొడక్ట్స్ కంపెనీకి చెందినది. మెలోడీ టాఫీ బ్రాండ్ ముంబయికి చెందిన ఒక ఎఫ్ ఎంసీజీ కంపెనీ అయిన పార్లే ప్రొడక్ట్స్ యాజమాన్యంలో ఉంది. ఈ కంపెనీ పార్లే-జీ, మొనాకో, హైడ్ అండ్ సీక్, మ్యాంగో బైట్ వంటి బ్రాండ్‌లతో గుర్తింపు పొందింది. ఇది భారత స్టాక్ మార్కెట్‌లో లిస్టవలేదు. అయితే పార్లే ఇండస్ట్రీస్ పేరుతో దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market) లో ఓ కంపెనీ ఉంది.

Parle Industries | పార్లే ఇండస్ట్రీస్, పార్లే ప్రొడక్ట్స్ రెండు వేర్వేరు

ఇది ఒక స్మాల్ క్యాప్ పెన్నీ స్టాక్ . మౌలిక సదుపాయాలు మరియు రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన ఒక బీఎసఈ లిస్టెడ్ కంపెనీ. ఇది కాగితం, కాగితపు వ్యర్థాలు, సంబంధిత రీసైక్లింగ్ ఉత్పత్తులలో కూడా వ్యాపారం చేస్తుంది. పార్లే ఇండస్ట్రీస్, పార్లే ప్రొడక్ట్స్ రెండు వేర్వేరు సంస్థలని తెలియక ఇన్వెస్టర్లు పొరబడ్డారు. పార్లే ఇండస్ట్రీస్ షేర్లను ఎగబడి కొనడంతో ఈ కంపెనీ షేరు ధర బుధవారం 5 శాతం పెరిగి రూ. 5.25 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఈ కంపెనీ షేర్లు 8 లక్షలకుపైగా చేతులు మారాయి. ఈ కంపెనీ ఒక వారపు సగటు ట్రేడింగ్ వాల్యూమ్ 2 లక్షలు కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: HDFC Bank | ఆ బ్యాంక్‌కు ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోం!

 

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...

Deloitte Visakhapatnam | విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. డెలాయిట్ ఎంట్రీకి సన్నాహాలు.. ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న సాగర నగరం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deloitte Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విశాఖపట్నం...

Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు...