Pressure Cooker Blast | కుక్కర్ పేలి మహిళకు గాయాలు.. కళాశాల వసతి గృహంలో ఘటన

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Pressure Cooker Blast | వంట చేస్తుండగా కుక్కర్ పేలి(cooker blast) మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాలలో(Tribal Residential School) శనివారం చోటుచేసుకుంది.

Pressure Cooker Blast | ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో..

ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో లావణ్య అనే మహిళ శనివారం విద్యార్థులకు వంట చేస్తోంది. ఈ క్రమంలో కుక్కర్​లో పప్పు ఉడకబెడుతుండగా ఒక్కసారిగా అది పేలింది. దీంతో వేడివేడి పప్పు లావణ్య ఒంటిపై పడడంతో ఆమె ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన సిబ్బంది లావణ్యను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రస్తుతం ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు. బాధితురాలికి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Instagram Instants | మెటా కొత్త అస్త్రం.. స్నాప్‌చాట్‌కు పోటీగా ఇన్‌స్టా కొత్త యాప్!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *