Rajinikanth Felicitation | తెయూ పాలకమండలి సభ్యుడు రజనీకాంత్​కు సన్మానం

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Rajinikanth Felicitation | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా కాకతీయ విద్యాసంస్థల (Kakatiya Educational Institutions) డైరెక్టర్​, ప్రముఖ విద్యావేత్త రజనీకాంత్​ ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన​ను ఉద్యోగ సంఘాల నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం జ్ఞాపికను అందజేశారు.

Rajinikanth Felicitation | యూనివర్సిటీ అభివృద్ధికి..

ఈ సందర్భంగా బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్​కుమార్​, టీఎన్జీవో జిల్లా అసోసియేటెడ్​ అధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా రజనీకాంత్​ నియమించడం సంతోషంగా ఉందన్నారు. విద్యావేత్తగా ఆయనకున్న అనుభవం యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వర్సిటీని మరింత అభివృద్ధిపథంలో తీసుకెళ్లాలని రజనీకాంత్​ను కోరారు. కార్యక్రమంలో నాయకులు మనోజ్, సుమన్, రంజిత్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Medicover Hospital | క్యాన్సర్​ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం: మెడికవర్​ ఆస్పత్రి వైద్యులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *