Alumni Reunion | 27 ఏళ్ల తర్వాత.. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

న్యాల్‌కల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Alumni Reunion | న్యాల్‌కల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Nyalkal ZPHS) 1998-99 పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో ఆదివారం జరిపారు.

Alumni Reunion | 27 ఏళ్ల తర్వాత..

27 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్న పూర్వవిద్యార్థులు(Alumni Meet) తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పట్లో తాము చేసిన చిలిపి పనులను గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలు.. బాధ్యతల గురించి చర్చించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్, రాజేందర్, నాగేశ్వరరావు, కాంతారావు, హేమలత, కృష్ణవేణి, స్వరూప, సూర్య కుమార్​లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడడం చూసి తమ శ్రమకు ఫలితం దక్కినట్లయ్యిందన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి (Nizamabad) సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమం అనంతరం గురువులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పూర్వ విద్యార్థులు బి.రమేష్, ఎం.శ్రీనివాస్, పి.లక్ష్మి తదితరులు కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అమ్మోనియా గ్యాస్ లీక్​.. ఏడుగురు మహిళలు మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *