అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Junaid Ali | అంతర్జాతీయ వేదికపై నిజామాబాద్ (Nizamabad) న్యాయవాదికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 29, 30తేదీల్లో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో(Bangkok Conference) జరగనున్న 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్(Global Conference on Climate) అండ్ ఎస్డీజీ సినర్జీస్లో ఇండియా తరపున జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది మహ్మద్ జునైద్ అలీ ప్రాతినిథ్యం వహించనున్నారు.
Junaid Ali | ప్రతిష్టాత్మకమైన సదస్సులో..
ఈ సదస్సు ఐక్యరాజ్యసమితి ఈఎస్సీఏపీ, డీఈఎస్ఏల సహకారంతో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు. మహ్మద్ జునైద్ అలీ తన అనుభవాన్ని, జ్ఞానాన్ని ఈ చర్చల్లో పంచుకోనున్నారు. ఈ అంతర్జాతీయ వేదిక, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి ఎస్డీజీలను సాధించడానికి అవసరమైన వ్యూహాలపై దృష్టి సారిస్తుంది. మహ్మద్ జునైద్ అలీ గతంలో పలు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని, న్యాయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన ఎంపిక నిజామాబాద్‌కు గర్వకారణమని, యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు. పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాద సంఘాల సభ్యులు జూనైద్ అలీకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘రేవంత్ రెడ్డి రైతుబంధు నిధులు జమ చేస్తానని