Jeevan Reddy | ‘ఆశన్నగారి’ అడుగులు ఎటువైపు..?

Shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్/​ఆర్మూర్: Jeevan Reddy | ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై నియోజకవర్గంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన త్వరలోనే బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గులాబీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి.

Jeevan Reddy | ఢిల్లీలో రహస్య మంతనాలు..?

ఇటీవల జీవన్​రెడ్డి (Ex Mla Jeevan reddy) రహస్యంగా ఢిల్లీకి(Delhi) వెళ్లి బీజేపీకి చెందిన కీలక నేతలతో భేటీ అయ్యారని, పార్టీ మార్పుపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని తెలుస్తోంది. ఈ విషయపై ఆర్మూర్​ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్​ఎస్​లో సరైన స్థానం లభించట్లేదనే ఆలోచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నారనే ప్రచారం జోరుందుకుంది.

Jeevan Reddy | కేసీఆర్​ సభకు దూరం.. పెరుగుతున్న అనుమానాలు..

జగిత్యాలలో మంగళవారం నిర్వహించిన కేసీఆర్(KCR) బహిరంగ సభకు జీవన్ రెడ్డి దూరంగా ఉండడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ఆయనకు, ఈసారి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించకపోవడం.. దానికి తోడు ఆయన ఆర్మూర్ నుంచి కార్యకర్తలను సమీకరించకపోవడం పార్టీ మార్పునకు సంకేతాలనేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

సందిగ్ధంలో కేడర్..

మరోవైపు ఈ ప్రచారంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అటు జీవన్ రెడ్డి కానీ, ఇటు ఆయన ప్రధాన అనుచరులు కానీ ఖండించకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా తలెత్తుతున్న ఈ ఊహాగానాలపై జీవన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

బీఆర్ఎస్​ను వీడేది లేదు..

– ఆశన్నగారి జీవన్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే 

నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు నిరాధారం. కాంగ్రెస్, బీజేపీ కుట్రలో భాగంగానే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడను. నా జీవితంలో బీఆర్​ఎస్​కు తప్ప వేరే పార్టీకి అవకాశమే లేదు. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ములేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే ఈ దుష్ప్రచారం. చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తాను. రాజకీయ ఓనమాలు దిద్దుకున్న బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్తాననేది పూర్తిగా అవాస్తవం.

ఇది కూడా చదవండి: Employee Strike | తెలంగాణలో మే 5 న టీజీఈజేఏసీ ఉద్యోగుల సమ్మె!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *