తెలంగాణArvind Comments on KCR | కేసీఆర్​ శకం ముగిసింది..: ఎంపీ అర్వింద్​

Arvind Comments on KCR | కేసీఆర్​ శకం ముగిసింది..: ఎంపీ అర్వింద్​

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​పై నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ ఫైర్​ అయ్యారు. జగిత్యాల సభలో కేసీఆర్​ మాటలకు కౌంటర్​ ఇచ్చారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Arvind Comments on KCR | బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​పై నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP Arvind) ఫైర్​ అయ్యారు. జగిత్యాల సభలో కేసీఆర్​ మాటలకు కౌంటర్​ ఇచ్చారు. ప్రతిపక్షనేతగా ప్రతిరోజూ ప్రజల మధ్య ఉండాల్సిన నేత.. ఏడాదికోసారి బయటకు వస్తున్నారన్నారు. కేసీఆర్​ శకం ముగిసిందని.. ఆయన కొడుకుకు ఓట్లు పడబోవని.. బయటకు వచ్చి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్​ అంత అబద్ధాల కోరు చరిత్రలో ఎవరూ లేరన్నారు.

Arvind Comments on KCR | మంత్రి పదవి ఇవ్వనందుకు ​పార్టీ

గల్ఫ్​ వలసలు ఆపుతానని చెప్పిన కేసీఆర్ (KCR) .. ఆయన ఇంట్లో ఇద్దరిని వలస నుంచి తిరిగి తీసుకొచ్చి పునరావాసం కల్పించారని అర్వింద్​ అన్నారు. మంత్రి పదవి ఇవ్వనందుకు కేసీఆర్​ పార్టీ పెట్టారని విమర్శించారు. ​తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయానికి వాడుకుంది కేసీఆర్​ అని వ్యాఖ్యానించారు. ఎంతో మంది నేతలను మోసం చేశారని మండిపడ్డారు. సెంట్రలైజ్​డ్​ కరప్షన్​ కోసమే ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​ ఒక్కటి చేశాడని.. మిషన్​ కాకతీయ పెట్టి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

Arvind Comments on KCR | బీఆర్​ఎస్​ చావు నువ్వు చూడాలే..

కేసీఆర్​కు తెలంగాణ (Telangana)పై నయా పైసా ప్రేమ లేదని ఎంపీ అన్నారు. కేవలం కుటుంబం, అవినీతి చేశారన్నారు. ఉద్యమాన్ని కేవలం అధికారం కోసం మాత్రమే నడిపారన్నారు. ఆయనను జాతిపిత అని ఎలా అంటారని ప్రశ్నించారు. కేసీఆర్​ చావాలని ఎవరూ కోరుకోవడం లేదని అర్వింద్​ అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని.. బీఆర్​ఎస్​ పార్టీ (BRS Party) చావును చూడాల్సి ఉందన్నారు. కూతురు జైలుకు వెళ్లడం చూశారని.. కొడుకు కూడా జైలుకు వెళ్లడం చూడాలన్నారు. కొడుకు, కూతురును తిరిగి అమెరికాకు పంపిస్తే తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు. అలాగే హరీశ్​రావు, సంతోష్​ను కూడా పంపించేయాలన్నారు. అప్పడే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం దూరమవుతుందని అర్వింద్​ అన్నారు.

Arvind Comments on KCR

Arvind Comments on KCR | ఆ ఇద్దరికి లాగుల మీద ప్రేమ

సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy), మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఇద్దరికి లాగులంటే ప్రేమ అని ఎద్దేవా చేశారు. ఒకరేమో లాగులో తొండలు అంటారు.. ఇంకొకరేమో లాగులు పగిలేదాకా కొట్టాలంటారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో అగ్రికల్చర్​ పాలసీ లేదు

రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్​ పాలసీ లేదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తే వానాలకు తడిచిపోతున్నాయన్నారు. ఎఫ్​సీఐ కేవలం ఫుడ్​ సెక్యురిటీ కోసం ధాన్యం సేకరిస్తుందని.. మొత్తం కొనుగోలు చేయాలని ఎలా అంటారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటుకు ఎక్స్​పోర్ట్​ చేయడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం అవుతుందన్నారు. రైస్​ బ్రాన్​ ఆయిల్​ ఇండస్ట్రీలు, వరి ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు స్థాపిస్తే బాగుంటుందన్నారు.

ఇది కూడా చదవండి..: crop procurement | పంట కొనుగోళ్లపై కొర్రీలు పెట్టడం సరికాదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....