అక్షరటుడే వెబ్‌డెస్క్: Rayadurgam Land Auction | హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలం వివాదాస్పదంగా మారింది. ఎస్‌బీఐ (SBI)కి కేటాయించిన భూమిని వేలం వేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ), వేలం ప్రక్రియపై మూడు వారాల పాటు స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Rayadurgam Land Auction | భూముల వేలం..
రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్ భూముల వేలం వ్యవహారం ఇప్పుడు న్యాయపోరాటానికి దారితీసింది. 2010లో తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వేలం వేసిందని ఎస్‌బీఐ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ఒక ప్రభుత్వ సంస్థకు కేటాయించిన భూమి అని తెలిసి కూడా వేలం ఎలా వేస్తారు? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించడమే మీ లక్ష్యమా?” అని ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో నిలదీశారు.

Rayadurgam Land Auction | కౌంటర్ దాఖలు చేయాలని..
దీనిపై స్పందించిన ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ (AAG) వాదిస్తూ.. 16 సంవత్సరాలు గడిచినా ఎస్‌బీఐ అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, నిబంధనల ఉల్లంఘన వల్లే వేలానికి నిర్ణయించామని సమర్థించుకున్నారు. దీని ద్వారా వచ్చే నిధులను ప్రజా సంక్షేమానికి వినియోగిస్తామని వివరణ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణ వరకు వేలం ప్రక్రియను నిలిపివేస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Education System India | కోచింగ్ మాఫియా చేతిలో ఏటా రూ. 3.5 లక్షల కోట్ల దోపిడీ: రాహుల్ గాంధీ