Education System India | కోచింగ్ మాఫియా చేతిలో ఏటా రూ. 3.5 లక్షల కోట్ల దోపిడీ: రాహుల్ గాంధీ

రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Education System India | రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులకు మేలు చేసేలా లేదని, ఇది కేవలం డబ్బులు వసూలు చేసే ఒక ‘దోపిడీ యంత్రాంగం’ (Extortion Mechanism)లా మారిందని ఆయన మండిపడ్డారు.

Education System India | బయటపెట్టిన షాకింగ్ లెక్కలు..

దేశవ్యాప్తంగా విద్యార్థులు , వారి తల్లిదండ్రులు పోటీ పరీక్షల కోసం పడుతున్న ఆర్థిక ఇబ్బందులపై ఆయన సంచలన గణాంకాలను బయటపెట్టారు. నీట్ (NEET), యూపీఎస్‌సీ (UPSC), జేఈఈ (JEE), ఎస్‌ఎస్‌సీ (SSC), ఆర్‌ఆర్‌బీ (RRB) వంటి ప్రధాన పరీక్షల ప్రిపరేషన్ కోసం ఏటా కుటుంబాలు రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 22 లక్షల మంది రాసే నీట్ పరీక్ష కోచింగ్ కోసమే కుటుంబాలు రూ. 1.32 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాయి. ఇది కేంద్రం విద్యా రంగానికి కేటాయించే మొత్తం బడ్జెట్‌తో (సుమారు రూ. 1.4 లక్షల కోట్లు) దాదాపు సమానం. ఈ ఐదు పరీక్షల కోసం ప్రజలు పెడుతున్న ఖర్చు, కేంద్రంలోని విద్య, ఆరోగ్యం, సైన్స్, కార్మిక, మహిళా-శిశు అభివృద్ధి శాఖల సంయుక్త బడ్జెట్‌తో సమానమని ఆయన వివరించారు.

Education System India | దోపిడీని అరికట్టాలని డిమాండ్ ..

తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాలను కరిగిస్తున్నారు.. ఆస్తులు అమ్ముకుంటున్నారు.. అప్పుల పాలవుతున్నారు అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లెక్కలు విద్యా వ్యవస్థలోని లోపాలను , కోచింగ్ సెంటర్ల వల్ల సామాన్యులపై పడుతున్న ఆర్థిక భారాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Telegram Dark Web | టెలిగ్రామ్ దేశంలో ‘కొత్త డార్క్ వెబ్’గా మారింది: కేంద్రం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *