తెలంగాణJagtial | జగిత్యాల జిల్లాలో విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

Jagtial | జగిత్యాల జిల్లాలో విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jagtial | జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందారు. ఈ ఘటన మేడిపల్లి మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

Jagtial | శివగంగ ఆలయ కొనేరులో..

కొండాపూర్ గ్రామానికి చెందిన పలువురు భక్తులు శివగంగ ఆలయంలో బుధవారం మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే మనవిత్ (10), మనస్విని (9), షర్వింద్ (7) అనే చిన్నారులు సమీపంలోని కోనేరు వద్దకు వెళ్లారు. కాగా.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండడంతో నీటి నుంచి బయటకు రాలేక ఊపిరాడక ప్రాణాలు విడిచారు.

Jagtial | ఆడుకుంటూ వెళ్లి..

చిన్నారులు కోనేరులో పడిపోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మేడిపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో కోనేరులో గాలించగా.. చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా.. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Singareni Coal Gasification| సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్‌కు కిషన్ రెడ్డితో భట్టి కీలక చర్చలు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...

Deloitte Visakhapatnam | విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. డెలాయిట్ ఎంట్రీకి సన్నాహాలు.. ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న సాగర నగరం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deloitte Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విశాఖపట్నం...

Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు...