crop procurement | పంట కొనుగోళ్లపై కొర్రీలు పెట్టడం సరికాదు..

Shashi kiran Mottala
crop procurement | పంట కొనుగోళ్లపై కొర్రీలు పెట్టడం సరికాదు..

అక్షరటుడే, కామారెడ్డి: crop procurement | రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం కొంతమేరకు మాత్రమే కొనుగోలు చేస్తామని కొర్రీలు పెట్టడం సరికాదని భారతీయ కిసాన్ సంఘ్(Bharatiya Kisan Sangh) జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి అన్నారు. తాడ్వాయి(Tadwai) మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు ధర్నా(farmers protest) నిర్వహించారు.

crop procurement | పంటలకు మద్దతు ధర ఇవ్వాల్సిందే..

ఈ సందర్భంగా పైడి విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరియా (Urea) కొనుగోలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విధానాన్ని తొలగించాలన్నారు. పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతులను అడుక్కునేలా చేశారని, రైతులకు కావాల్సిన ప్రతీది కొట్లాడి సాధించుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

crop procurement | దోచుకుంటున్న దళారులు..

ప్రైవేట్ వ్యాపారులు మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,800 మాత్రమే కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వం మాత్రం రూ.2400 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించిందన్నారు. అలాగే జొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు రూ.1,800 నుంచి రూ.2,000 వరకు మాత్రమే ఇస్తున్నారని, ప్రభుత్వం క్వింటాలుకు రూ.3,749 ఇస్తుందన్నారు. దీనికోసం ప్రభుత్వం వెంటనే రైతు పండించిన పంటను మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ప్రోత్సహించకుండా ఎకరానికి15-20 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెప్పడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం రైతులకు కావాల్సిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కిసాన్ సంఘ్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan Die-Hard Fan | పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం ప్ర‌త్యేక పూజ‌లు.. ఆల‌యం మెట్ల‌న్ని మోకాళ్ల‌తో ఎక్కిన వీరాభిమాని

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *