Paddy Procurement | కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Paddy Procurement | జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మండలం (Kamareddy Mandal) గర్గుల్, రామారెడ్డి మండలం గోకుల్ తండాల్లో మంగళవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

Paddy Procurement | కొనుగోళ్ల తీరుపై ఆరా..

ఈ సందర్భంగా కేంద్రాల్లో కొనుగోళ్ల తీరుపై స్టీఫెన్​ రవీంద్ర రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులను ఆరాతీశారు. అనంతరం ప్యాడీ కొనుగోళ్లలో భాగంగా పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు చెల్లింపులు త్వరగా జరగేందుకు ఓపీఎంఎస్ ట్యాబ్ (OPMS Tab)​లలో నమోదును సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 35,300 మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనుగోలు జరిగిందని అధికారులు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్​, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Paddy Procurement

ఇది కూడా చదవండి..: Gram Panchayat Buildings | జీపీ నూతన భవనాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు: ఎమ్మెల్యే పోచారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *