అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Congress Promises | రాష్ట్రంలో లేఖల రాజకీయం కొనసాగుతోంది. కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలని ఇటీవల రెండు సార్లు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సీఎంకు లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు కాకపోవడంపై వినతిపత్రం సమర్పించేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రెండున్నరేళ్లు గడిచినా మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, వృద్ధులకు సంబంధించిన హామీలు ఇంకా నెరవేరలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకోసం రాహుల్‌గాంధీతో సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
Telangana Congress Promises | గ్యారెంటీల కోసం..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను విశ్వసించి, భారత జాతీయ కాంగ్రెస్‌పై అఖండ విశ్వాసం ఉంచి పార్టీకి ఓటు వేశారన్నారు. 2023 సెప్టెంబర్ 17న రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో జరిగిన సమావేశం, ఆరు గ్యారెంటీలు ఆ నిబద్ధతలకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తర్వాత హామీలు అమలు చేయడం లేదన్నారు. వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.
Telangana Congress Promises | హామీలు అమలు చేయాలి
మహిళలకు రూ.2,500, రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15,000 చొప్పున వాగ్దానం చేసిన సహాయం కోసం రైతులు ఇంకా ఎదురుచూస్తున్నారని రాంచందర్‌రావు అన్నారు. అనేక హామీలు అమలుకు నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో గ్యారంటీల పేరిట ఓట్లు అడిగిన రాహుల్ గాంధీకి ఈ విషయాన్ని వివరించడానికి సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సీఎంను కోరారు.
ఇది కూడా చదవండి..: Electric Bus Fire | ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం