అక్షరటుడే, వెబ్డెస్క్: Electric Bus Fire | కరీంనగర్ జిల్లా (Karimnagar District) అలుగునూర్ రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు (RTC electric bus) ఆదివారం ఉదయం కరీంనగర్ నుంచి బయలుదేరింది. అలుగునురు సమీపంలోకి రాగానే బస్సులో పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తం అయి బస్సును పక్కన ఆపాడు. అనంతరం అందులోని 39 మంది ప్రయాణికులు కిందకు దిగారు. ప్రయాణికులు కిందకు దిగిన వెంటనే క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.
Electric Bus Fire | ప్రయాణికుల ఆందోళన
బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. బస్సును నిలిపిన తర్వాత డ్రైవర్, స్థానికులు మంటలను ఆర్పడానికి యత్నించారు. అయితే అవి వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. షార్ట్ సర్క్యూట్ (Short circuit)తో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
BREAKING: కరీంనగర్: HYD వెళ్తున్న RTC ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం pic.twitter.com/0b9gjiXMf8
— prasad (@prasadchekri) June 21, 2026
ఇది కూడా చదవండి..:Panipuri Food Poisoning | పానీపూరి తిని 20 మంది చిన్నారులకు అస్వస్థత