Adibatla Fire Accident | ఆదిభట్లలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని ఓ ఏరోస్పేస్​ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Adibatla Fire Accident | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) ఆదిభట్ల పరిధిలోని  గౌర ఏరోస్పేస్ టెక్నాలజీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశాయి.

నాదర్‌గుల్ దగ్గర ఉన్న గౌర ఏరోస్పేస్ టెక్నాలజీ యూనిట్‌లో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. యంత్రాలను ఆన్​ చేస్తుండగా.. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Adibatla Fire Accident | ఇటీవల ప్రారంభం

నాదర్​గుల్​ నుంచి ఆదిభట్ల మార్గంలో ఈ ఏరో స్పేస్​ కంపెనీని ఇటీవలే ప్రారంభించారు. కొన్ని రోజులుగా ఒక షిఫ్ట్​లో పనులు చేపడుతున్నారు. బుధవారం రాత్రి రెండో షిఫ్ట్​ పనులు చేపట్టడానికి యంత్రాలను ప్రారంభించారు. ఆ సమయంలో షార్ట్​ సర్క్యూట్ (Short circuit)​తో మంటలు వ్యాపించాయి. వెంటనే ఉద్యోగులను బయటకు పంపడంతో ప్రాణ నష్టం తప్పింది. యూనిట్​లోని యంత్రాలు కాలిబూడిద అయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Moderate Rain | నేడు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *