అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Moderate Rain | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రోజంతా వాతావరణం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ (Telangana)లోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు పడుతాయి. 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Telangana Moderate Rain | ఎల్నినో ప్రభావంతో..

వానాకాలం ప్రారంభమై నెల దాటిపోయింది. అయినా ఇంత వరకు భారీ వర్షాలు పడలేదు. ఎల్నినో ప్రభావంతో జూన్లో లోటు వర్షపాతం నమోదు అయింది. దీంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. రైతులు నిత్యం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. బోరుబావుల కింద మాత్రమే ప్రస్తుతం వరి నాట్లు సాగుతున్నాయి. అడపదడపా వర్షాలు పడుతున్నా.. ఇంతవరకు భారీ వాన మాత్రం పడలేదు. వాగులు, వంకలకు ఒక్కసారి కూడా వరద రాలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..: Nallamala Jungle Safari | నల్లమలలో జంగిల్ సఫారీ మూసివేత