Kamareddy Tree Plantation | మొక్కల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మొక్కలను నాటడమే కాదని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Tree Plantation | మొక్కలను నాటడమే కాదని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. శుక్రవారం ఆయన రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో పర్యటించారు.

Kamareddy Tree Plantation | నాటాలి..వాటిని సంరక్షించాలి..

ఈ సందర్భంగా వన మహోత్సవంలో నాటిన మొక్కలకు నీరు పోసి వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి ఆరోగ్యంగా పెరిగేలా చూడటం కూడా అంతే ముఖ్యమన్నారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందిస్తూ, అవి ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో కొత్తగా ఇళ్లు మంజూరైన అటికెల భూమయ్య, గణేష్ లకు మంజూరు పత్రాలను అందజేశారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.

Kamareddy Tree Plantation | ఫామ్​పాండ్​ పనుల పరిశీలన..

అలాగే గ్రామానికి చెందిన కందూరి భూలక్ష్మి రైతు పొలంలో నిర్మాణంలో ఉన్న వ్యవసాయ క్షేత్రపు నీటి కుంట ఫామ్ పాండ్ పనులను పరిశీలించారు. ఫామ్ పాండ్ల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చని, భూగర్భ జలాల పెంపునకు దోహదపడటంతో పాటు పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు అందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఆర్‌డీవో దామోదర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్, ఎంపీడీవో నాగేశ్వర్, తహశీల్దార్ ఉమాలత, ఏఈ పీఆర్ సురేష్, ఏఈ ఆర్​డబ్ల్యూఎస్ విష్ణువర్ధన్, ఏఈ ట్రాన్స్ కో సుధాకర్, ఏపీవో ధర్మారెడ్డి, సర్పంచ్ కిషన్ యాదవ్, ఉప సర్పంచ్ మధుకర్, పంచాయతీ కార్యదర్శి పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం..: మున్సిపల్ ఛైర్​పర్సన్ ఉమారాణి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *