Employee Strike | తెలంగాణలో మే 5 న టీజీఈజేఏసీ ఉద్యోగుల సమ్మె!

Srinivas Kolluri

అక్షరటుడే,హైదరాబాద్: Employee Strike | తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ ఇబ్బందుల్లో ఉండగా, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోరాట బాట పట్టారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మే 5వ తేదీన భారీ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ (Government of Telangana) ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి కమిటీ లేఖ ద్వారా సమాచారం అందించింది.

Employee Strike | ప్రధాన డిమాండ్లు ఇవే:

ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా TGEJAC ప్రధానంగా నాలుగు అంశాలపై డిమాండ్ చేస్తోంది.

నూతన వేతన సవరణ కమిషన్ నివేదికను వెంటనే అమలు చేయాలి.

పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలి.

ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌ను పటిష్టం చేయాలి.

సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.

Employee Strike | ఆందోళనలు మరింత ఉధృతం..

తమ సమస్యలపై ఏప్రిల్ 17న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. వినతులకు విలువ ఇవ్వని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అందులో భాగంగానే మే 5న నిరాహార దీక్షకు దిగుతున్నామని TGEJAC స్పష్టం చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర పాలనా యంత్రాంగంపై సమ్మె సెగ తగిలే అవకాశం కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి..: HYDRAA Action | రూ.90 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *