Hyderabad Division Increase | హైదరాబాద్​లో పెరగనున్న డివిజన్లు

హైదరబాద్​ మహా నగరం పరిధిలో మళ్లీ డివిజన్లు పెంచనున్నట్లు సమాచారం.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Division Increase | హైదరబాద్​ (Hyderabad) మహా నగరం పరిధిలో మళ్లీ డివిజన్లు పెంచనున్నట్లు సమాచారం. జీహెచ్​ఎంసీలో గతంలో ప్రభుత్వం పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసిన విషయం తెలిసిందే. అనంతరం 150 డివిజన్లను 300కు పెంచింది. అనంతరం జీహెచ్​ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించింది. తాజాగా మరోసారి ఆయా కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

గతంలో ఉన్న జీహెచ్​ఎంసీ (GHMC) ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్​ఎంసీతో పాటు మల్కాజ్​గిరి, సైబరాబాద్​ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హద్దులు నిర్ణయించి, డివిజన్ల పునర్విభజన చేసింది. ఈ మూడు కార్పొరేషన్లలో ప్రస్తుతం 300 డివిజన్లు ఉండగా.. వాటిని 400కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Hyderabad Division Increase | విభజన ఇలా

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 150 డివిజన్లు ఉండగా.. 200కు పెంచనున్నారు. మల్కాజ్ గిరి కార్పొరేషన్​లో76 నుంచి 100 డివిజన్లకు, సైబరాబాద్ కార్పొరేషన్​లో 74 నుంచి 100 డివిజన్లకు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. పరిపాలన సౌలభ్యం కోసం జీహెచ్​ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే మరోసారి డివిజన్లు పెంచనున్నట్లు సమాచారం.

Hyderabad Division Increase | త్వరలో ఎన్నికలు

జీహెచ్​ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగిసిపోయింది. దీంతో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జీహెచ్​ఎంసీతో పాటే సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల కోసం కాంగ్రెస్​ ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. హైదరాబాద్​ నగరంలో నాయకులు పర్యటిస్తున్నారు. బస్తీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. మరోవైపు పారిశుధ్యం, తాగునీటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

ఇది కూడా చదవండి..: Hyderabad Fake Paneer | హైదరాబాద్‌లో కల్తీ పనీర్ దందా బట్టబయలు: 825 కిలోలు స్వాధీనం.. వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *