Government School | తన పిల్లలను సైతం సర్కారు బడిలోనే.. ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయుడు

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇద్దరు పిల్లలను సర్కార్​ బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి:  Government School | ఊరిలో సర్కారు పాఠశాలను వదిలి సిటీలో కార్పొరేట్​ స్కూల్​కు(Corporate school) దారి కడుతున్న ఈ రోజుల్లో.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు  పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. సర్కారు బడిపై నమ్మకాన్ని పెంచాలనే లక్ష్యంతో తన పిల్లలను సైతం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు.

Government School | గూడెం ప్రభుత్వ పాఠశాలలో..

మండలంలోని (Yellareddy) అన్నాసాగర్​ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా విధులు నిర్వహిస్తున్న నాగభూషణం తన ఇద్దరు పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. తన కొడుకు అశ్రిత్, కూతురు అమూల్యలను ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గూడెం ప్రభుత్వ పాఠశాలలో 1, 2 తరగతుల్లో చేర్పించారు.

Government School | అందరికీ ఆదర్శంగా..

ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థుల తల్లిదండ్రులకు ‘ప్రభుత్వ బడుల్లో చేర్పించండి’ అని ప్రచారం చేస్తూనే, తాను కూడా ఆచరించి చూపారు నాగభూషణం. ఆయన నిర్ణయం ఎల్లారెడ్డి మండల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రైవేట్ మోజులో పడకుండా ప్రభుత్వ బడులను నమ్మేలా ప్రేరణ ఇస్తోంది.

Government School | తెలుగు బోధనలో మాధుర్యం.. ప్రభుత్వ బడిపై ప్రేమ

తెలుగు భాష బోధనలో మాధుర్యం.. మమకారం ఎంతగా ఉందో.. ప్రభుత్వ పాఠశాలలపై కూడా అంతే ప్రేమ ఉందని నాగభూషణం అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, స్నేహభావం ఉంటాయని తాను నమ్ముతానన్నారు. అదే నమ్మకంతో తన పిల్లల భవిష్యత్తును ప్రభుత్వ బడిలోనే వెతుక్కున్నానని ఆయన పేర్కొంటున్నారు. ‘ప్రభుత్వ ఉపాధ్యాయులమైన మేము పాఠాలు చెప్పే బడులనే నమ్మకపోతే ఇక ఎవరు నమ్ముతారు..’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇస్తున్న మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం వంటి సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని.. అందరం కలిసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

school 3

ఇది కూడా చదవండి:  Hyderabad Division Increase | హైదరాబాద్​లో పెరగనున్న డివిజన్లు

 

 

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *