Drunk Ambulance Driver | డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడ్డ అంబులెన్స్​ డ్రైవర్​

డ్రంకన్​ డ్రైవ్ తనిఖీల్లో అంబులెన్స్​ డ్రైవర్​ పట్టుబడ్డాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drunk Ambulance Driver | డ్రంకన్​ డ్రైవ్ తనిఖీల్లో అంబులెన్స్​ డ్రైవర్​ పట్టుబడ్డాడు. ఈ మేరకు ట్రాఫిక్​ పోలీసులు (Nizamabad Traffic police) వివరాలు వెల్లడించారు.

Drunk Ambulance Driver | కంఠేశ్వర్​ ప్రాంతంలో..

నగరంలోని కంఠేశ్వర్​ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ట్రాఫిక్​ సీఐ సురేష్​ ఆధ్వర్యంలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అంబులెన్స్​ను ఆపి డ్రైవర్​ను తనిఖీలు చేయగా ఆయన మద్యం సేవించినట్లు గుర్తించారు. దీంతో అంబులెన్స్​ను ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. డ్రైవర్​ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని ట్రాఫిక్​ సీఐ సురేష్​ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకన్​ డ్రైవ్​ కారణంగా ఇతరుల ప్రాణాలకు సైతం ముప్పు వాటిళ్లే అవకాశం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: పండుగ వేళ బిగ్ షాక్..పెరిగిన కమర్షియల్ సిలిండర్ల ధరలు.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *