Nizamabad Couple Assault Arrest | దంపతులపై దాడిచేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్​

ఆటోను నెమ్మదిగా నడపాలని పేర్కొన్నందుకు దంపతులపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Couple Assault Arrest | ఆటోను నెమ్మదిగా నడపాలని పేర్కొన్నందుకు దంపతులపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు(Nizamabad Police) అరెస్ట్​ చేశారు. ఈ మేరకు 1వ టౌన్ పోలీసులు వివరాలు వెల్లడించారు.

Nizamabad Couple Assault Arrest | గాజుల్​పేట్​ సంతలో..

నగరంలోని గాజుల్​పేట్ సంతలో ఆటోను నెమ్మదిగా నడపాలని కోరిన దంపతులపై ఇద్దరు వ్యక్తులు ఇనుపరాడ్‌తో దాడి చేసి గాయపరిచారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో మంచిప్పకు చెందిన కమ్మరి రాజు, కామారెడ్డికి చెందిన రమంచ విష్ణును అదుపులోకి తీసుకున్నారు. ఆటోను చోరీ చేసి తిరుగుతూ.. దంపతులను ఢీకొట్టనబోగా వారు హెచ్చరించారు. దీంతో వారిపై ఇద్దరు దాడి చేశారు. విచారణలో ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసి రాడ్​ను స్వాధీనం చేసుకున్నారు.కమ్మరి రాజు, విష్ణులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో చోరీల కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరిని న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు వన్​టౌన్​ ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ తెలిపారు.

ఇది కూడా చదవండి: తాగిన మైకంలో సొంత ఇంటికే నిప్పు.. సిలిండర్ పేలుడుతో ఫైర్ ఆఫీసర్‌కు గాయాలు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *