Chandrayampally Culvert Works | చంద్రాయన్​పల్లి వద్ద కల్వర్టు పనులు త్వరగా పూర్తి చేయాలి

ఇందల్వాయి మండలం చంద్రాయన్​పల్లి కల్వర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీపీ సాయిచైతన్య సంబంధిత కాంట్రాక్టర్​కు సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Chandrayampally Culvert Works | ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రాయన్​పల్లి కల్వర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సంబంధిత కాంట్రాక్టర్​కు సూచించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న చంద్రాయన్​ పల్లి వద్ద స్పాట్​ను పరిశీలించారు.

Chandrayampally Culvert Works | సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి

నేషనల్ హైవే మేనేజర్ (టెక్) రంగారావు, హైవే కాంట్రాక్టర్ బాల్ రెడ్డితో సీపీ మాట్లాడారు. కల్వర్టు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే.. జాతీయ రహదారిపై వాహనదారులు వేగాన్ని నియంత్రించుకునేలా తగిన ప్రదేశాల్లో స్పష్టమైన సూచిక బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాత్రి వేళల్లోనూ వాహనదారులకు ప్రమాదకర ప్రాంతాలు ముందుగానే కనిపించేలా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. టోల్ ప్లాజా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ , రహదారిపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈ ​తనిఖీల్లో ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ మల్లేష్​, డిచ్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వినోద్, ఇందల్వాయి ఎస్సై సుమలత, ఇందల్వాయి సర్పంచ్ రఘు  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో  

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *