అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Blood Donation | అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్తదానం చేసి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగరంలోని పరేడ్ గ్రౌండ్లో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు.
Blood Donation | స్వచ్ఛందంగా రక్తదానం చేసిన పోలీసులు..

ఈ సందర్భంగా శిబిరంలో పలువురు పోలీసులు, కళాశాలల విద్యార్థులు, యువకులు రక్తదానం చేశారు. వారిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం మహాదానమని.. విలువైన ప్రాణాలు కాపాడే లైఫ్‌లైన్ అని ఆయన పేర్కొన్నారు. ఏసీపీ ప్రకాశ్, రూరల్ సీఐ శ్రీధర్, ఉమెన్ పీఎస్ సీఐ ప్రసాద్, నాల్గో టౌన్ సీఐ సతీష్‌తో సహా సుమారు 200మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ పోతన్కర్ లక్ష్మీనారాయణ, వైస్ ఛైర్మన్ డాక్టర్ సీనునాయక్, కోశాధికారి కెంపుల నాగరాజు కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Adani Cement | అదానీ సిమెంట్‌తో క్షత్రియ కళాశాల ఒప్పందం