Adani Cement | అదానీ సిమెంట్‌తో క్షత్రియ కళాశాల ఒప్పందం

విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఆర్మూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ముందుకెళ్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Adani Cement | విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఆర్మూర్ (Armoor) క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ముందుకెళ్తోంది. ఈ క్రమంలో కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రముఖ సంస్థ అయిన అదానీ సిమెంట్‌తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.

Adani Cement | పారిశ్రామిక సందర్శనలు..

ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు పారిశ్రామిక సందర్శనలు (Industrial Visits), ఇంటర్న్‌షిప్‌లు (Internships), పరిశ్రమల నిపుణులతో అతిథి ఉపన్యాసాలు (Expert Guest Lectures), ప్రత్యక్ష ప్రాజెక్టులపై మార్గదర్శకత్వం (Live Project Guidance) వంటి అవకాశాలు లభించనున్నాయి. ఈ ఒప్పందం విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని కళాశాల యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్​ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారిని పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే కళాశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. అదానీ సిమెంట్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం విద్యార్థులకు పరిశ్రమల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు, భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. కటకం శ్రీనివాస్, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరేందర్, కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి నెమలి దీపిక పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Hajipur Tiger Sighting | వామ్మో పెద్దపులి.. హాజీపూర్​ వాసులను హడలెత్తిస్తున్న వైనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *