అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ambedkar Open University | ఒకప్పుడు చదువు కోసం ఊరు వదిలి పోవాల్సి వచ్చేది. ఈరోజు టెక్నాలజీ వల్ల తరగతి గది మన ఇంటికే వచ్చింది. దూర విద్య ద్వారా పల్లెల్లోని విద్యార్థులు కూడా దేశంలోని టాప్ యూనివర్సిటీలతో సంబంధాలు పెంచుకుంటున్నారు. తద్వారా ఇంట్లోనే చదువుకుంటూ పట్టాలు సాధిస్తున్నారు.
Ambedkar Open University | ఉద్యోగం.. ఇంటి బాధ్యతలు
ఉద్యోగం చేస్తూనే, ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే డిగ్రీలు, కోర్సులు పూర్తి చేస్తున్నారు. అలాంటి దూరవిద్యలో చేరేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది. ప్రవేశాలు పొందేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొని దూరమైన విద్యను దగ్గర చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు అభ్యర్థులు. ఆర్థిక ఇబ్బందులు, తదితర కారణాల వల్ల ఉన్నత చదువుకు దూరమైన విద్యార్థులకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వరంగా మారింది.
Ambedkar Open University | అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ..
ప్రభుత్వం ఉద్యోగాలకు అర్హతగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University) ద్వారా పూర్తి చేసిన డిగ్రీని రెగ్యులర్ డిగ్రీతో సమానంగా గుర్తిస్తోంది. దీంతో చదువు మధ్యలో ఆపిన వారికి, ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశం లభించింది. ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల కొందరు ఉన్నత చదువులకు దూరం అవుతుంటారు. మరి కొందరు రెగ్యులర్ తరగతులకు వెళ్లలేక ఊరుకుంటుంటారు. అలా మధ్యలో ఆపేసిన వారికి చదువుకోవడానికి ప్రభుత్వం చక్కటి అవకాశం కల్పిస్తోంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు రెగ్యులర్ డిగ్రీ పూర్తి చేసిన వారితో సమానం. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Ambedkar Open University | ఉమ్మడి జిల్లాల్లో 9 కేంద్రాలు..
నిజామాబాద్ (Nizamabad), బోధన్, ఆర్మూర్, మోర్తాడ్, భీమ్‌గల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దూరవిద్య సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బోధిస్తున్నారు. ఇంటర్ సమాన విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం టీవీ, డీటీవీ, డీఎస్సీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సులు ఎంచుకొని డిగ్రీ పూర్తి చేయవచ్చు. ఆసక్తి ఉన్న పలువురు ఈ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఆర్థిక ఇబ్బందులున్న విద్యను మరింత చేరువ చేసేలా ప్రభుత్వం నెలకు ఐదు తరగతులు అంటే ప్రతి ఆదివారం పాటు రెండో శనివారం తరగతులు నిర్వహిస్తోంది.
Ambedkar Open University | జత చేయాల్సి పత్రాలివే..

పది, ఇంటర్, తదితర మార్కుల జాబితా, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, మొబైల్ నంబర్ ఉంటే వర్సిటీలో దరఖాస్తు చేసుకోవచ్చు. 2026-2027 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫీజు ఎంట్రీ రుసుం రూ.3,400 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. పుస్తక ఫీజు ప్రతి సెమిస్టర్‌కు అవసరమైతే చెల్లించాలి. దరఖాస్తుకు జత చేసిన పత్రాలను సెంటర్లో ఇవ్వాలి. బుక్స్ కోసం రూ.500 డిపాజిట్ ద్వారా ఇంటికి వస్తుంది. వచ్చేనెల ఆగస్టు 7 తేదీ వరకు అవకాశం ఉంది. వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 73829 29570, 040-23680 222ను సంప్రదించాలి.
Ambedkar Open University | రెగ్యులర్ డిగ్రీతో సమానం..
– రజిత, అంబేడ్కర్ సెంటర్ కోఆర్డినేటర్, నిజామాబాద్
చదువు మధ్యలో ఆపిన వారికి అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వరం లాంటిది. మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ రెగ్యులర్ డిగ్రీతో సమానం. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు రాయడానికి అర్హులు.
ఇది కూడా చదవండి..: Dichpally BC Association | విద్యుత్ బీసీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక