Inter Supplementary Results | ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ బాలికలదే పైచేయి

ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. 2025_26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బోర్డు గురువారం విడుదల చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Inter Supplementary Results | ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. 2025_26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్​ సప్లిమెంటరీ (intermediate board) పరీక్షల ఫలితాలను బోర్డు గురువారం విడుదల చేసింది. ఈ వివరాలను నిజామాబాద్ (Nizamabad)​ డీఐఈవో రవికుమార్​ వెల్లడించారు.

Inter Supplementary Results | నిజామాబాద్​ జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో ఫస్టియర్​ జనరల్ విద్యార్థినులు 5,241 మంది పరీక్షలకు హాజరు కాగా 3,839 మంది పాసై 73.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే జనరల్ ఫస్టియర్​ బాలురు 4,908 మంది హాజరు కాగా 2,687 మంది విద్యార్థులు పాసై 54.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం జనరల్ మొదటి సంవత్సరం విద్యార్థులు 10,147 మంది హాజరు కాగా 6,526 మంది పాసై 64.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఫస్టియర్​ వొకేషనల్(Vocational Cource) బాలికలు 329 మంది పరీక్షలు హాజరుకాగా 257 మంది పాసయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ బాలురు 960 మంది పరీక్షలకు హాజరై 679 మంది ఉత్తీర్ణత పొందారు. మొత్తం ఒకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు 1,289 మంది పరీక్షలకు హాజరు కాగా 931 మంది పాసై 72.61 శాతం పాసయ్యారు.

Inter Supplementary Results | సెకండియర్​లో..

అలాగే రెండో సంవత్సరం జనరల్ బాలికలు 2,066 పరీక్షలకు హాజరు కాగా 1,204 పాసై 58.28 శాతం ఉత్తీర్ణత సాధించారని డీఐఈవో తెలియజేశారు. అలాగే జనరల్ సెకండియర్​ బాలురు 3,470 మంది పరీక్షలకు హాజరు కాగా 1,896 మంది పాసై 54.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం సెకండియర్​ జనరల్ విద్యార్థులు 5,536 మంది పరీక్షలకు హాజరు కాగా 3,100 మంది విద్యార్థులు పాసై 56శాతం పాస్​ అయ్యారు. వోకేషనల్ సెకండియర్​లో బాలికలు 162 మంది పరీక్షలకు హాజరుకాగా 106 మంది పాసై 65.43 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఒకేషనల్ సకండ్​ ఇయర్​ బాలురు 771 మంది పరీక్షలు రాయగా 420 మంది పాస్ అయ్యారు. మొత్తం ఒకేషనల్ 933 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరై 526 మంది పాస్ కాగా 56.38 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి: US Attack on Ship | నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయుల మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *