US Attack on Ship | నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయుల మృతి

ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న 'సెటెబె' వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: US Attack on Ship | ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ‘సెటెబె’ వాణిజ్య నౌకపై అమెరికా (America) దాడి చేసింది. ఈ ఘటనలో దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ధృవీకరించారు.

ఈ వారం ప్రారంభంలో ఒమన్ తీరంలో అమెరికా దళాలు ఒక నౌకపై దాడి చేయడంతో, మొదట గల్లంతైనట్లుగా వార్తలు వచ్చిన ముగ్గురు భారతీయ నావికులు మరణించారని షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. దీనిని ఒక “విషాదకరమైన” నష్టంగా అభివర్ణిస్తూ, గల్లంతైన ముగ్గురు నావికుల మృతదేహాలను వెలికితీసినట్లు మంత్రి చెప్పారు.

US Attack on Ship | 24 మంది భారతీయులు

అమెరికా సైన్యం దాడికి గురైనప్పుడు, పలావు జెండా కలిగిన ‘సెట్టెబెల్లో’ అనే చమురు ట్యాంకర్‌లో 24 మంది భారతీయులు (Indians), నలుగురు విదేశీయులతో సహా మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు పాకిస్థానీలు, ఒక ఉక్రేనియన్, ఒక రష్యన్ ఉన్నారు. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందున, ఇరాన్ నుండి చమురును తీసుకువస్తున్నందున ఆ నౌకపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఈ ఘటనలో డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్‌ మృతి చెందారు.

US Attack on Ship | ఖండించిన భారత్​

నౌకపై దాడిని భారత్​ ఖండించింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపేయాలని పేర్కొంది.అంతర్జాతీయ జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛగా జరిగేలా చూడాలంది. ఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారి జేసన్‌ మీక్స్‌ను పిలిపించి తీవ్ర భారత్​ నిరసన తెలిపింది. కాగా గురువారం సైతం భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ విషయాన్ని ఒమన్‌లోని భారత ఎంబసీ ధ్రువీకరించింది.

ఇది కూడా చదవండి..: Congress Key Meeting | కాంగ్రెస్​ కీలక సమావేశం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *