POK Protest Shootings | పీవోకేలో మరోసారి కాల్పులు.. 16 మంది మృతి

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనకారులపై పాక్‌ సైనికుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : POK Protest Shootings | పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (POK)లో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. నిరసనకారులపై పాక్‌ సైనికుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. పాక్‌ కాల్పుల్లో రెండు రోజుల క్రితం 30 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

పీవోకేలో మూడు రోజులుగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. తమకు సౌకర్యాలు కల్పించాలని నిరసన తెలుపుతున్నారు. అయితే ఈ ఆందోళనలను పాక్​ ఆర్మీ అణచివేస్తోంది. తాజాగా రావల్కోట్ ప్రాంతంలో నిరాయుధ ప్రదర్శనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. పారామిలిటరీ దళాలు, పోలీసులు వేలాది మంది పౌర హక్కుల కార్యకర్తలపై నేరుగా కాల్పులు జరపడంతో పాటు, భారీగా టియర్ గ్యాస్ ప్రయోగించారు.

POK Protest Shootings | పలువురికి తీవ్ర గాయాలు

పీవోకేలోని ఈద్గా మైదానంలో సమావేశమైన వేలాది మంది నిరాయుధ నిరసనకారులపై పాకిస్థాన్ సైన్యం ఏకే-47 రైఫిళ్లతో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 37 మంది గాయపడ్డారు. తక్కువ ధరలకు పిండి, బియ్యం, విద్యుత్ అందించాలని, ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు శాంతియుతంగా ప్రారంభించిన ఈ ప్రదర్శన, పాకిస్థాన్ సైన్యం గుంపుపై కాల్పులు జరపడంతో హింసాత్మకంగా మారింది.

POK Protest Shootings | ఉద్యమాన్ని కొనసాగిస్తాం

ఉద్యమ నాయకుడైన, పీవోకేకు చెందిన రాజకీయ కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రాణనష్టం జరిగినప్పటికీ ఉద్యమాన్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరినీ పాకిస్తాన్ “ఉగ్రవాది”గా ముద్ర వేస్తుందని ఆయన అన్నారు. ఈ ర్యాలీలో స్థానిక రాజకీయ నాయకులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రతినిధులు ప్రసంగించారు.

దీనిని కూడా చదవండి : US Attack on Ship | నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయుల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *