Nizamabad RTC | ఆర్టీసీ ఆర్​ఎంగా ఎస్పీజీకే మూర్తి బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్​ ఆర్టీసీ ఆర్​ఎంగా ఎస్పీజీకే మూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్​ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad RTC | నిజామాబాద్​ ఆర్టీసీ రీజినల్​ మేనేజర్​గా ఎస్పీజీకే మూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లాకు విచ్చేసిన ఆయనకు ఆర్టీసీ (TGSRTC) డీఆర్​ఎం, డీఎంలు, ఉద్యోగులు సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన కలెక్టర్​ ఇలా త్రిపాఠిని (Collector Ila Tripathi) మర్యాదపూర్వకంగా కలిశారు.

Nizamabad RTC | జిల్లాలో ఆర్టీసీ సేవలను విస్తృత పరుస్తాం..

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్​ఎం మూర్తి కార్యాలయంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపరింటెండెంట్లు, రీజియన్ కార్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొత్త బస్సు మార్గాల అవసరం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ప్రజారవాణా సౌకర్యాల విస్తరణ, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల, విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన బస్సు సేవల కల్పన వంటి అంశాలపై చర్చించారు. జిల్లా ప్రజలకు సురక్షితమైన, సమయపాలనతో కూడిన, నాణ్యమైన రవాణా సేవలను అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కట్టుబడి ఉందన్నారు.

ravi

ఇది కూడా చదవండి: POK Protest Shootings | పీవోకేలో మరోసారి కాల్పులు.. 16 మంది మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *