Journalism Values | జర్నలిజం విలువలు కాపాడాలి: ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

జర్నలిజం విలువలు కాపాడేలా జర్నలిస్టులు కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) తృతీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Journalism Values | జర్నలిస్టులు జర్నలిజం విలువలు కాపాడేలా కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(KVR MLA) అన్నారు. శుక్రవారం కామారెడ్డి (kamareddy)పట్టణంలోని పార్శీరాములు కల్యాణ మండపంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) (TUWJ IJU)తృతీయ మహాసభలు నిర్వహించారు. అలాగే జిల్లా కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం నిర్వహించారు.

Journalism Values | జర్నలిజానికి అత్యంత ప్రాధాన్యత..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా జర్నలిస్టులు పని చేస్తారని, ప్రస్తుతం పెయిడ్ జర్నలిజంతో విలువలు తగ్గిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజం, ఏది అబద్దమో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నిజానిజాలను నిగ్గు తేల్చడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు ఉపయోగపడేలా, వారి సమస్యల పరిష్కారమయ్యేలా వార్తలు ప్రచురించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, కార్యదర్శి రాంనారాయణ, మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Journalism Values | నూతన కార్యవర్గం ఇదే..

కామారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే(ఐజేయు) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్నికైన సభ్యులతో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రమాణస్వీకారం చేయించారు. జిల్లా అధ్యక్షుడిగా రజనీకాంత్, కార్యదర్శిగా తోట రాజేష్, కోశాధికారిగా ముదాం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా సయ్యద్ కౌసర్అలీ, ఎండీ అబీద్, ముదాం శంకర్, బాలయ్య, ఎండీ యూనస్, సహాయ కార్యదర్శులుగా శ్రీనివాస్ రెడ్డి , సాయిప్రసాద్, కే.శ్రీనివాస్ రావు , యు.రామకృష్ణ, లక్ష్మినారాయణ, కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్, ఈ.వెంకటేశ్వర్లు, ఇంజమూరి శ్రీనివాస్, కే.గంగాధర్, జే.బాలప్రకాష్, ఎండీ వాజీద్ అలీ, జి.శ్రీనివాస్, మేకల రవి, భవాని ఎన్నికయ్యారు.

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా పి.శ్రీనివాస్, కార్యదర్శిగా బి. సుధాకరౌడ్, కోశాధికారిగా జి. సత్య నారాయణగౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంఏ మాజీద్, సహాయ కార్యదర్శులుగా రామేశ్వర్ రావు, ఎన్.సాయిరాం, జే.వీరయ్య, రవీందర్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా అవునూరి ఆశన్న, ఎండీ రజాక్, పోచయ్య, గంగాధర్, బన్సీలాల్, దినకర్, ప్రవీణ్ కుమార్​లు ఎన్ని కయ్యారు.

yhuhk

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *