Urea Supply App | జిల్లాలో యాప్​ ద్వారానే యూరియా సరఫరా..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Urea Supply App |  జిల్లాలో యూరియా (Urea) పంపిణీని ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Urea Supply App | జిల్లాలో..

ఇప్పటివరకు జిల్లాలో 1,29,824 మంది రైతులు 3,55,795 బస్తాలను కొనుగోలు చేశారని వీరస్వామి తెలిపారు. మండలం యూనిట్​గా జిల్లాలోని అన్ని మండలాలకు కూడా ఈ సదుపాయవ కల్పించామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 23వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులకు సౌకర్యవంతంగా ఉండేటట్లు శాస్త్రీయంగా పంటలకు నత్రజని అందించే విధంగా ఈ యాప్​ను రూపొందించినట్లు చెప్పారు. రైతులంతా యాప్ విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే వ్యవసాయ విస్తీర్ణాధికారిని లేదా మండల వ్యవసాయ అధికారిని, సొసైటీలకు సంబంధించినటువంటి అధికారులను, వలంటీర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో యూరియా పుష్కలంగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. పంటలకు సరిపోయే యూరియాను అందించే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంటుందన్నారు.

Urea Supply App

ఇది కూడా చదవండి..: Journalism Values | జర్నలిజం విలువలు కాపాడాలి: ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *