Padmashali Committee Elections | కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ కార్యవర్గం ఎన్నిక

కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Padmashali Committee Elections | కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) పద్మశాలి అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగరంలోని సంఘం కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Padmashali Committee Elections | ఎన్నికల అధికారి భూమేశ్వర్​ ఆధ్వర్యంలో..

ఎన్నికల అధికారి చౌటి భూమేశ్వర్ పర్యవేక్షణలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పెంట దత్తాద్రి, సలహాదారులు అమృతాపూర్ గంగాధర్, ఎస్​ఆర్​ సత్యపాల్, బిళ్ల మహేష్, బొట్టు వెంకటేష్ సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ కార్యవర్గం 2026 నుండి 2028 వరకు రెండేళ్ల కాలపరిమితితో బాధ్యతల్లో కొనసాగనుంది. పద్మశాలి సామాజికవర్గ అభివృద్ధికి, సంస్థ నియమావళికి లోబడి నిబద్ధతతో సేవ చేస్తామని నూతన సభ్యులు స్పష్టం చేశారు.

 

అధ్యక్షుడిగా భీమర్తి రవి,ప్రధాన కార్యదర్శిగా కొండవత్రి రాజేందర్ (లక్కోర), కోశాధికారిగా మేక శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా క్యాతం జగన్​మోహన్​, తేలి ప్రదీప్, చిలువేరి గణేష్, సహాయ కార్యదర్శులుగా ఇరుముల్ల శివలింగం, సురుకుట్ల భాస్కర్, అంకం రాజేందర్, ప్రచార కార్యదర్శిగా పల్నాటి రఘు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ధోర్నాల రవి, ఈసీ మెంబర్లుగా శ్రీరాం దత్తాద్రి, గోవిందరాజులు, గంగుల రవి, గుండెల్లి కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు.

Padmashali Committee Elections

ఇది కూడా చదవండి..: Urea Supply App | జిల్లాలో యాప్​ ద్వారానే యూరియా సరఫరా..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *