అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Land Tax | మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు త్వరలో పన్ను విధిస్తామన్నారు.
పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రకం (పన్ను) కట్టే వ్యవస్థ ఉండేదన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు అయినా తర్వాత కూడా కొన్ని రోజులు ఇది అమలులో ఉందని తెలిపారు. ప్రస్తుతం అలాంటి విధానం తీసుకు వచ్చేందుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
Telangana Land Tax | భూమికి భద్రత
టాక్స్ కడితే భూ ఆక్రమణలు జరగకుండా భూమికి భద్రత ఉంటుందని మంత్రి తెలిపారు. గతంలో కాకుండా తక్కువ పన్ను విధిస్తామన్నారు. ప్రస్తుతం చాలా మంది సాగు చేసుకుంటున్న భూములకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కనీసం కాగితం ముక్క కూడా లేకపోవడంతో ఆ భూమి తమదేన అని రైతులు (Farmers) అప్పుడప్పుడు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇలాంటి ఇబ్బందులు తప్పేలా పన్ను కట్టే విధానం తీసుకొచ్చి రశీదు ఇస్తామన్నారు. దీంతో ఆ భూమి తమదేనని రైతులకు ఒక ఆధారం ఉంటుందని తెలిపారు.
Telangana Land Tax | సమస్యలకు పరిష్కారం

ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో భూ వివాదాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. జీవో 117 ఉన్న, లేని ప్రాంతాల్లో సైతం సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ట్యాక్స్ విధానం తీసుకు వస్తే ఇవి పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పన్ను అమలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. దీనిని పరిశీలించిన తర్వాత అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరం అయితే దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అయితే రైతులకు ఇబ్బంది లేకుండా అందుబాటు ధరలో పన్ను విధిస్తమని చెప్పారు.
త్వరలో రైతుల భూములపై టాక్స్: పొంగులేటి
త్వరలో రైతుల భూములపై టాక్స్ వసూలు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నామినల్ పెట్టాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. ఇలా టాక్స్ కడితే భూ ఆక్రమణలు జరగకుండా భూమికి భద్రత ఉంటుందన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై… pic.twitter.com/pXhTJWMFb4
— Akshara Today | Telugu News (@aksharatoday) June 13, 2026
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Students | విద్యార్థులకు బండి సంజయ్ ‘గిఫ్ట్’.. సైకిళ్ల పంపిణీ