Lorry Accident | లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Lorry Accident | లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో (nizamabad City) మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

Lorry Accident | పని ముగించుకుని ఇంటికి వస్తుండగా..

పోలీసులు(Nizamabad police) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హస్మీ కాలానికి చెందిన షేక్ షాకీర్ మేస్త్రి పని చేస్తుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం బోర్గాం(కే) గ్రామంలో మేస్త్రి పని పూర్తయిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గూపన్​పల్లి క్రాసింగ్ (goopanpally crossing) వద్ద వేగంగా అజాగ్రత్తగా వస్తున్న లారీ షేక్ షాకీర్ బైక్​ను ఢీకొంది. ఈ ఘటనలో షాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రూరల్ టౌన్​ ఎస్సై సీహెచ్​ శ్రీనివాస్​ లారీని సీజ్ చేసి డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు.

ఇది కూడా చదవండి: Tanuja Murder సి ase| ఐపీఎస్ భార్య హత్య కేసు.. పనిమనుషుల విషయంలో పోలీసుల కీలక హెచ్చరిక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *