అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | నిజామాబాద్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 30 ఫిర్యాదులు అందాయి. సోమవారం సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు.
Police Prajavani | సమస్యలు పరిష్కరించాలి
సీపీ సాయిచైతన్య స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వేచ్ఛగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. వారి సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని సీపీ అన్నారు.
ఇది కూడా చదవండి..: Prajavani Complaints | ప్రజావాణిలో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి..